: మావోయిస్టులపై కేసులు ఎత్తివేయాలి: విరసం నేత వరవరరావు
మావోయిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ సమావేశానికి హాజరైన వరవరరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఆ విషయంపైనే దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన సమయంలో చాలా సంతోషమేసిందని చెప్పిన వరవరరావు, తాజాగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఆ సంతోషం కాస్తా ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పుడు యాగీ చేస్తున్న కేసీఆర్, కేకే నాడు పార్లమెంటులో ఏం చేశారని ఆయన నిలదీశారు.