: బ్యాంకింగ్ సెక్టార్ లో మొబైల్ శాఖలు ప్రారంభించిన ఆర్బీఐ గవర్నర్


ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లో పట్టణ ఆర్ధిక స్వావలంబన ప్రయత్నంలో భాగంగా ఏటీఎం సౌకర్యం కలిగిన రెండు మొబైల్ శాఖలను ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రారంభించారు. ఉత్తర చెన్నైలోని రాయపురం, తిరుబొట్రియర్, తోండియార్ పేట్... దక్షిణ చెన్నై లోని కన్నగి నగర్, తంధై పెరియార్ నగర్, సెమ్మెన్ చెర్రీలో ఇటీవల ఆ రెండు శాఖలను ప్రారంభించారని చెన్నైకు చెందిన ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే 70 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎనిమిది మోబైల్ శాఖలను నడుపుతున్నామని బ్యాంకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టీఎం భాసిన్ వెల్లడించారు. త్వరలో ముంబయి, న్యూఢిల్లీలో మరో రెండు బ్రాంచులను ఏర్పాటు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News