: రాజధానిపై పుకార్ల షికారు: కఠారి శ్రీనివాస రావు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎంపికయ్యే రాజధాని నగరం ఏదన్న అంశంపైనే పుకార్లు షికారు చేస్తున్నాయని, దీనిపైనే సర్వత్ర చర్చ జరుగుతోందని లోక్ సత్తా నేత కఠారి శ్రీనివాసరావు అన్నారు. కొందరు రాజకీయ నేతలు కొన్ని ప్రాంతాల్లో వందలాది ఎకరాల మేర భూములను కొనుగోలు చేసి, వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మలచుకుని భారీ లాభాలను మూటగట్టుకునే క్రమంలోనే లీకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన రాయలసీమ యూత్ ఫోర్స్ తొలి సమావేశానికి హాజరైన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News