: ఇటు భద్రకాళీ ఆలయంలో.. అటు ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
వరంగల్ లోని భద్రకాళీ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని 18 రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలోనూ శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని, దీవెనలందుకొన్నారు.