: మహిళల్ని ఆకర్షించాలనుకుంటున్నారా?... ఇలా చేయండి!
పార్టీలు, ఫంక్షన్లలో అమ్మాయిల్ని ఆకర్షించాలని ఉవ్విళ్లూరే అబ్బాయిలకు న్యూయార్క్ లోని రోచెస్టర్ యూనివర్సిటీ చక్కని సలహా ఇచ్చింది. పార్టీలలో అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులకు ఆకర్షితులవుతారని ఆ యూనివర్సిటీ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. పార్టీలలో మహిళలు ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న పురుషుల పట్ల బాగా ఆకర్షితులవుతారని, ఎరుపు రంగు వేసుకొచ్చే భర్తలను వారి భార్యలు ఇతరుల వలలో పడకుండా కాపలా కాస్తుంటారని ఆ పరిశోధన తెలిపింది. అదే సమయంలో... మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మాత్రం వారిని ఇతర మహిళలు అభ్యంతరకరంగా భావిస్తారని, మరికొందరు మహిళలు వారి పట్ల ఆకర్షితులవుతారని పరిశోధన వివరించింది. అందుకే పార్టీలకు వెళ్లేవారు ఎరుపు రంగు దుస్తులు వేసుకెళితే మహిళలను ఆకర్షించే అవకాశం ఉందని పరిశోధకులు సలహా ఇచ్చారు. ఏమైనా... పెళ్ళికాని యువతీయువకులు ఈ సలహా పాటిస్తే ఫర్వాలేదు గానీ, వివాహితులు ఈ సలహాను స్వీకరిస్తే మాత్రం ప్రమాదమేనండోయ్!