: బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు మృతి
పశ్చిమ బెంగాల్ లోని మాల్దా వైద్య కళాశాల ఆస్పత్రిలో శనివారం ఒక్కరోజే ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. బరువు తక్కువగా ఉన్న కారణంగానే వీరు మరణించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఏ రషీద్ చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే చిన్నారులు చనిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆస్పత్రిలో చిన్నారులు పదుల సంఖ్యలో చనిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. జూన్ లో మెదడువాపు కారణంగా కొంతమంది చిన్న పిల్లలు చనిపోగా, జనవరిలో 12 మందికి పైగా పిల్లలు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.