: డేవిడ్ కామెరూన్ కేబినెట్ లో మరింత మంది మహిళలు!
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కేబినెట్ లో మహిళా మంత్రుల సంఖ్య పెరగనుంది. కొద్దిరోజుల్లోనే కేబినెట్ ను భారీ ఎత్తున విస్తరించేందుకు కామెరూన్ సమాయత్తమవుతున్నారట. 2015లో జరగనున్న ఎన్నికల దరిమిలా తిరిగి అధికారం చేపట్టే దిశగా కామెరూన్ ప్రణాళికలు రచిస్తున్నారట. తన కేబినెట్ లో మూడో వంతు మంత్రి పదవులను మహిళలకు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చిన కామెరూన్, ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. దీంతో నలువైపుల నుంచి ఈ అంశానికి సంబంధించిన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే ఎన్నికలకు వెళితే కాస్త ఇబ్బందేనని కేబినెట్ మిత్రులు సూచిస్తున్నారు. అంతేకాక కామెరూన్ సతీమణి కూడా మరింత మంది మహిళలకు అవకాశమివ్వండని కోరిందట. దీంతో కామెరూన్ తన కేబినెట్ లో భారీ ఎత్తున మార్పు చేర్పులు చేయనున్నాడట. తాజా విస్తరణలో ఎంపీగా నామినేట్ అయిన భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.