: బీజేపీ తెలంగాణ కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి
హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి యత్నించారు. కార్యాలయం గేట్లు దూకి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అటు వెంటనే వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.