: చేతిలో ఫోన్ లేకపోతే కష్టం గురూ!: అర్జున్ కపూర్


మొబైల్ ఫోన్ ఇప్పుడో నిత్యావసర వస్తువుగా మారిపోయిందని అంటున్నాడు, '2 స్టేట్స్' సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. మార్కెట్ లో ఎన్ని గాడ్జెట్ లు ఉన్నా ఫోన్ ది ప్రత్యేక స్థానం అని చెప్పాడు. దుస్తులు వేసుకోవడం మర్చిపోయినా ఫోన్ ని మాత్రం మర్చిపోకూడదని అన్నాడు. ఫోన్ ద్వారా ఆత్మీయులందరితో అనుబంధం పెంచుకోవచ్చని సూచిస్తున్నాడు. అలాగే ప్రమాదంలో ఉన్నా సహాయం కావాలంటే ఫోన్ చాలా ఉపయోగపడుతుందని తెలిపాడు. నిత్యం బిజీగా ఉండే తనకు ఫోన్ అత్యంత సన్నిహితమైన వస్తువని అర్జున్ కపూర్ పేర్కొన్నాడు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడే అర్జున్ కపూర్!

  • Loading...

More Telugu News