: విశాఖ నేవీ మెయిన్ క్యాంటీన్ లో ఎగసిపడుతున్న మంటలు
విశాఖపట్నంలోని నావికాదళ బేస్ క్యాంప్ క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారాన్ని అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏడు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. క్యాంటీన్ ను ఆనుకొనే స్టేట్ బ్యాంక్ భవనం ఉంది.