: విజయనగరం జిల్లాలో రోడ్డుప్రమాదం... ఇద్దరి మృతి


విజయనగరం జిల్లాలోని భోగాపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News