: నెంబర్ వన్ కూలీగా కష్టపడతా: బాబు
రాష్ట్రాభివృద్ధి కోసం నెంబర్ వన్ కూలీగా కష్టపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమష్టిగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో అభినందన సభలో మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకొకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతానని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా బాబు హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు చేసిన ఉద్యమం మరువలేనిదన్నారు. ఉద్యోగులు సమ్మె చేసిన 80 రోజుల కాలాన్ని సెలవు దినాలుగా పరిగణిస్తామని చెప్పారు.