: 'బ్రింగ్ బాబు బ్యాక్' టీమ్ పనితీరు అద్భుతం: లోకేశ్
2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంలో 'బ్రింగ్ బాబు బ్యాక్' టీమ్ పనితీరు అద్భుతమని టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు టీడీపీ సాంకేతిక నిపుణుల విభాగం కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సమావేశంలో వారితో చెప్పారు. 50 నుంచి 60 వార్డుల్లో టీడీపీకే అనుకూలత ఉందని, గెలుపు కోసం గట్టిగా పని చేయాలని నిపుణుల విభాగానికి లోకేశ్ సూచించారు. 2019 నాటికి పెరిగే అసెంబ్లీ సీట్లలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.