: పోలవరం అంశం ఆదివాసీల హక్కులపై జరుగుతున్న దాడి: కోదండరాం


పోలవరం అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదని, అది ఆదివాసీల హక్కులపై జరుగుతున్న దాడి అని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నేడు తెలంగాణ బంద్ సందర్భంగా ఆయన పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలవరంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో కేంద్రం వైఖరి నిరంకుశత్వంగా ఉందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News