: లేడీ డైరెక్టరుతో పనిచేయాలనుకున్నా: సినీ నటి మీనా
మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయాలనుకున్నానని సినీ నటి మీనా తన మనసులో మాట బయటపెట్టింది. చాలా కాలం నుంచి లేడీ డైరెక్టరుతో కలిసి పనిచేయాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని మీనా చెప్పింది. వెంకటేశ్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమా విడుదలైన సందర్భంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కాగా, 'దృశ్యం' సినిమాకు సీనియర్ నటి శ్రీప్రియ దర్శకురాలిగా వ్యవహరించింది.