: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆర్ట్ డైరెక్టర్ కళాధర్
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ చైన్నైలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అయనను వెంటనే విజయ ఆస్పత్రిలో చేర్పించారు. కళాధర్ తొలితరం కళాదర్శకుడిలో ఒకరు. గుండమ్మకథ, జగదేకవీరుని కథ, అప్పు చేసి పప్పుకూడు, గండికోట రహస్యం, కాలం మారింది ... ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.