: భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు
ఇవాళ గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాదులోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు దేవాలయాల్లో బారులు తీరారు. దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్కు వద్ద సాయిబాబా దేవాలయాల్లో గురుపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. సాయి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.