: విద్యారంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం: జగదీష్ రెడ్డి
తెలంగాణలో అందరికీ విద్య అందేలా కృషి చేస్తామని టీమంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. విద్యారంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలను అరికడతామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమైందని అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మాఫీ అయ్యేలా చూస్తామని చెప్పారు.