: చింతపల్లిలో గంజాయి రాకెట్ పట్టివేత


విశాఖ జిల్లాలోని చింతపల్లి ప్రాంతంలో కొంతకాలంగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. ముఠాలోని నలుగురు సభ్యులతో పాటు వారు ప్రయాణిస్తున్న కారు, అందులోని 89 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి ప్రాంతంలో శనివారం ఉదయం తనిఖీలు జరుపుతుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును నిలిపి తనఖీలు చేయగా, గుట్టు బయటపడిందని చింతపల్లి డీఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ ఉపాధ్యాయుడు కోటగున్నాల ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News