: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ను తొలగించిన ఎన్డీఏ
యూపీఏ హయాంలో నియమితులైన పలు రాష్ట్రాల గవర్నర్లు రాజీనామా చేయాలంటూ బీజేపీ ఒత్తిడి తేవడంతో ఎవరికివారుగా పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను నరేంద్రమోడీ ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ను తొలగించినట్లు తెలిపింది. ఆ స్థానంలో అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్ కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటనలో పేర్కొంది.