: రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన హెచ్ టీసీ
థాయ్ లాండ్ బేస్డ్ మొబైల్ ఫోన్ల తయారీదారు హెచ్ టీసీ భారత మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. డిజైర్ 616, వన్ ఈ8 పేర్లతో వీటిని భారత వినియోగదారుల ముందుకు తెచ్చింది. డిజైర్ 616 ధర రూ. 16,900 కాగా, వన్ ఈ8 ధర రూ. 34,990. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, భారత్ లో మొబైల్ ఫోన్ల మార్కెట్ విలువ వందల కోట్లకు చేరుకుందని... ఇందులో 15 శాతాన్ని సొంతం చేసుకోవడమే హెచ్ టీసీ లక్ష్యమని చెప్పారు.