: నా కొడుకు రాజకీయాల్లోకొస్తాడు: రాజ్ థాకరే


మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే కూడా తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తాడట. "నా కొడుకు అమిత్ రాజకీయాల్లోకి వస్తాడు. అది ఎప్పుడన్న విషయం సరైన సమయంలో చెబుతాం. నా కొడుకేమీ రాకెట్ కాదు కదా, లాంచ్ చేయడానికి, కౌంట్ డౌన్ చెప్పడానికి!" అంటూ శుక్రవారం ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం సదస్సులో ప్రసంగించిన సందర్భంగా రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. థాకరేకున్న ఇద్దరు సంతానంలో పెద్దవాడైన 22 ఏళ్ల అమిత్ ప్రస్తుతం డీజీ రూపారెల్ కళాశాల నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేశారు. ఆర్కిటెక్చర్ పై మక్కువ చూపే అమిత్ పార్టీ వ్యవహారాలపై అంతగా ఆసక్తి కనబరచిన దాఖలాలు లేవు. అయితే నిన్నటి లోక్ సభ ఎన్నికల సందర్భంగా తండ్రి వెంట పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు. సో... మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ వారసుడు తెరపైకి వచ్చేస్తున్నట్లేనన్నమాట.

  • Loading...

More Telugu News