: ఢిల్లీలో సోనియాను కలసిన డీఎస్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ రోజు తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో నానాటికీ దిగజారిపోతున్న పార్టీ పరిస్థితిపై అధినేత్రికి వివరించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి వెళ్లడం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా చూపకపోవడంపైన వివరించినట్లు సమాచారం.