: శని ఉపగ్రహంపై వాతావరణ మార్పులు!
భూమిపై తప్ప మరే ఇతర గ్రహాలపై అయినా.. వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయా? అనేది ఖగోళ శాస్త్రవేత్తలకు చాలాకాలంగా ఉన్న సందేహాల్లో ఒకటి. వాతావరణ మార్పులను బట్టి గ్రహాల స్థితి గతులను అంచనా వేయడం సాధ్యమవుతుందని ఆశ. తాజాగా నాసా వారి 'కాసిని' అంతరిక్షనౌక టైటాన్ ఉపగ్రహంపై మంచు మేఘాలు ఏర్పడుతుండడాన్ని, వాతావరణ మార్పులను నమోదు చేసింది. టైటాన్ అంటే.. శని గ్రహానికి ఉండే ఉపగ్రహాలలో అతి పెద్దది. టైటాన్ ఉత్తర ధ్రువంపై ఈ మంచు మేఘాలను ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ద్వారా గుర్తించారు. 'ఇలాంటి మంచు మేఘాన్ని గుర్తించడం మేం ఇదే తొలిసారి' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డొనాల్డ్ ఇ. జెన్నింగ్స్ చెప్పారు.