: హాస్టల్ లో పాము... భయంతో పరుగులు తీసిన బాలికలు
హాస్టల్ లోకి ఓ విషసర్పం చొరబడటంతో బాలికలు భయంతో పరుగులు తీశారు. హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ సిబ్బందితో కలసి వార్డెన్ పాము కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ మూలన నక్కిన పామును గుర్తించి కర్రతో కొట్టి చంపేశారు. దీంతో, బాలికలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో సంభవించింది.