: అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెంలోని శ్రీ కనకదుర్గ అమ్మ వారి ఆలయంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గుడిలోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విలువైన ఆభరణాలతో పాటు హుండీని కూడా అపహరించుకునిపోయారు. ఈ విషయాన్ని శనివారం తెల్లవారుజామున గుడికి వచ్చిన పూజారి గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించడంతో పాటు అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన వివరాలను పూజారి నుంచి సేకరిస్తున్నారు. అమ్మవారి ఆభరణాల విలువ భారీగానే ఉంటుందని ప్రాథమిక సమాచారం.