: చైనాలో అతిపురాతన డైనోసారస్ గుడ్డు శిలాజాలు
చైనాలో తాజాగా అతి పురాతనమైన డైనోసారస్ గుడ్డు శిలాజాలను కనుగొన్నారు. వీటి ద్వారా వీటి పిండాలు చాలా వేగంగా ఎదిగేవి అనే సంగతిని కూడా తెలుసుకున్నారు. లక్షల ఏళ్ల కిందట అంతరించిపోయిన జీవజాతి డైనోసారస్ ఆవర్భావ క్రమాన్ని తాము పూర్తిగా తెలుసుకున్నామని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిర్ణయించేసుకున్న తరువాత.. చైనాలో పురాతన గుడ్డు శిలాజాలు బయటపడ్డాయి.
డైనోసార్లే అత్యంతపురాతనమైనవనే విషయాన్ని నిర్ధరించడంలో ఈ విషయం మరో ముందడుగు అని భావిస్తున్నారు. ఇవి సుమారుగా 190-197 మిలియన్ సంవత్సరాలకు పూర్వం నాటివని తేలుస్తున్నారు. లోయర్ జురాసిక్ యుగానికి చెందినవని అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. ఈ గుడ్డు పిండాలలో ఉన్న ఆర్గానిక్ పదార్థం ఇన్నాళ్లుగా శిలాజాలుగా మారలేదు. దాంతో ఇప్పటివరకు ఎన్నడూ కనుగొనని అతిపురాతనమైన ఆర్గానిక్ పదార్థంగా దీన్ని తేల్చారు.