: విద్యార్థుల స్థానికతపై టీసర్కార్ మల్లగుల్లాలు... కటాఫ్ 1974?
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వర్తింపజేయడానికి ఏ సంవత్సరాన్ని కటాఫ్ గా నిర్ణయించాలనే అంశంపై టీసర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. 1956కి ముందు వచ్చి స్థిరపడిన వారినే స్థానికులుగా పరిగణించి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేయాలని గతంలో టీప్రభుత్వం భావించినప్పటికీ... దానిపై పలువురు అభ్యంతరం తెలపడంతో పునరాలోచనలో పడింది. దీంతో కటాఫ్ ఇయర్ ను 1974కు మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, 1956 కటాఫ్ ఇయర్ పై పెట్టిన నిబంధనలే 1974పై కూడా పెట్టాలని భావిస్తున్నారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ పై మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.