: గన్ మిస్ ఫైర్... కానిస్టేబుల్ మృతి


మెదక్ జిల్లా కలెక్టరేట్ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్ లోని ట్రెజరీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి చేతిలోని గన్ మిస్ ఫైర్ అయింది. ఈ దారుణ ఘటనలో రమేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. గన్ మిస్ ఫైర్ అయిందా? లేక కావాలనే కాల్చుకున్నాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన కానిస్టేబుల్ కడప జిల్లా వాసి.

  • Loading...

More Telugu News