: జపాన్ ను కుదిపేసిన భూకంపం... సునామీ హెచ్చరిక జారీ


జపాన్ ను ఈ ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. టోక్యోకు ఈశాన్య దిశగా ఉన్న ఫుకుషిమా తీర సముద్రంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు జపాన్ మెటియొరాలజికల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అంతేకాకుండా, జపాన్ ఉత్తర తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఫుకుషిమాలోని డైచీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు ఏమైనా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో ప్లాంట్ ను చెక్ చేస్తున్నారు. అయితే, భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News