: విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయండి: టీఆర్ఎస్
పోలవరంకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలను టీఆర్ఎస్ కోరింది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని విజ్ఞప్తి చేసింది. బంద్ లో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొనాలని టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ కుట్రను ఎండగట్టాలని కోరారు. తెలంగాణ బంద్ కు తెలంగాణ విద్యార్థి ఐకాస, ఉస్మానియా ఐకాసలు కూడా మద్దతు ప్రకటించాయి.