: పోలీసులపై శంకర్ రావు కుమార్తె ఆగ్రహం
శంకర్రావు అరెస్టు వ్యవహారంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆయన కుమార్తె సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు శంకర్రావు కాకుండా 'శంకర్ రెడ్డి' అని వుండి ఉంటే కనుక పోలీసులు అరెస్టు చేసే వారు కారని ఆమె వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న శంకర్రావును మేకపోతును తీసుకువెళ్ళినట్లు లాక్కువెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరని సుస్మిత ప్రశ్నించారు. తమ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండానే పోలీసులు తమ దాష్టీకం చూపారని ఆమె అన్నారు. ప్రస్తుతం శంకర్రావు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.