: నేడు తెలంగాణ బంద్
తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే బిల్లుకు లోక్ సభ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ బంద్ పాటిస్తున్నారు. వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతున్నారని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. ప్రాథమిక హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రాల గొంతు నొక్కేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గిరిజనుల హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు. రాష్ట్రాల సరిహద్దులను మార్చాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఆదివారం నాడు బోనాల పండుగ ఉండటంతో సికింద్రాబాద్ ప్రాంతానికి మాత్రం బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.