: ఒడిషా, ఉత్తరాఖండ్, తెలంగాణ ఆమోదం లేకుండా బిల్లు ఎలా చేస్తారు?: డీఎస్


ఒడిషా, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల ఆమోదం లేకుండా పోలవరం బిల్లును ఆగమేఘాల మీద ఎందుకు ఆమోదించారని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత డీఎస్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ఆనాడు కొన్ని గ్రామాలను పునర్విభజన చట్టంలో చేర్చామని, అంతమాత్రాన మండలాలకు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చేందుకు ఒప్పుకోమని ఆయన తెలిపారు. గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News