: తెలుగు భాష కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిలికానాంధ్ర
తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పేందుకు అమెరికాలోని వివిధ నగరాలలో వున్న ప్రవాసాంధ్రులు కంకణం కట్టుకున్నారు. అందుకోసం సిలికానాంధ్ర సంస్థ ‘మనబడి ప్రభంజనం’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మనబడి ప్రభంజనం’ ప్రచార చిత్రాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి శాన్ హుసేలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రస్తుతం 3 వేల మంది వరకు తెలుగు భాషను నేర్చుకుంటున్నారని, ఈ సంఖ్యను 5 వేలకు పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని 'మనబడి' ఛాన్సలర్ చామర్తి రాజు చెప్పారు. మనబడిలో చేరాలనుకునే వారు ఇంటర్నెట్లో రిజిస్టర్ చేసుకోవాలని, సెప్టెంబరు 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం సిలికానాంధ్ర చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే!