: గోవా గవర్నర్ గా మార్గరెట్ ఆల్వా


ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ గా వున్న మార్గరెట్ ఆల్వా గోవా గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. రేపు (శనివారం) సాయంత్రం ఆరు గంటలకు ఆ రాష్ట్ర రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో గవర్నర్ గా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారని గోవా ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహిత్ శాంతిలాల్ షా ఆమె చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అగస్టా వెస్ట్ ల్యాండు కేసులో గోవా గవర్నర్ గా ఉన్న బీ. వీ.వాంఛూను ఈ నెల 4న సీబీఐ విచారించింది. ఆ వెంటనే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News