: కేటీఆర్ ను కలిసిన మెట్రో రైలు బాధితులు
హైదరాబాదులోని అమీర్ పేట, మధురానగర్, యూసుఫ్ గూడ, కృష్ణానగర్ లో నివసించే ఇంటి యజమానులు, వ్యాపారస్థులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడును వినిపించారు. మెట్రో రైలు కారిడార్-3 వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో రోడ్డు విస్తీర్ణం ఇప్పటికే చాలా తక్కువగా ఉందని, మెట్రోతో రోడ్డు మరింత చిన్నదైపోతుందని వారు చెప్పారు. పాత రూట్ మ్యాప్ ప్రకారమే మెట్రో రైలు రూట్ ను నిర్మించాలని వారు మంత్రికి విన్నవించారు. బెంగళూరులో కూడా ఇలాంటి సమస్యే ఎదురైనప్పుడు అక్కడ భూగర్భ మార్గం ద్వారా మైట్రో మార్గాన్ని నిర్మించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. హైదరాబాదులో కూడా ఆ పద్ధతినే కొనసాగించాలని వారు కేటీఆర్ ను కోరారు.