: గాయకుడు హనీ సింగ్ కూడా కబడ్డీ టీమ్ ను కొన్నాడు


స్టార్ రాపర్, పాప్యులర్ గాయకుడు హనీసింగ్ కూడా 'వరల్డ్ కబడ్డీ లీగ్'లో ఇప్పుడు ఓ కబడ్డీ టీమ్ ను కొన్నాడు. దానికి 'యో యో టైగర్స్' అని పేరు పెట్టాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తర్వాత కబడ్డీ జట్టును కొన్నది హనీ కావడం విశేషం. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ, యాక్షన్ ఆధారంగా ఉండే ఆటలు అంటే చాలా ఇష్టమని, కబడ్డీ తన ఫేవరేట్ అని చెప్పాడు. తాను బాగే నమ్మే, ఇష్టపడే ఆటతో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నానని అన్నాడు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వివిధ దేశాల్లో జరిగే కబడ్డీ మ్యాచ్ ల్లో తన టీమ్ టొరెంటోలో ఆడనున్నట్టు చెప్పాడు.

  • Loading...

More Telugu News