: రేపు తెలంగాణ బంద్
రేపు తెలంగాణ బంద్ కు టీ-జేఏసీ పిలుపునిచ్చింది. పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చినట్లు టీ-జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. రేపటి బంద్ లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై న్యాయపరంగా పోలవరాన్ని అడ్డుకునేందుకు ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.