: బాబు... అంతంటాడు...ఇంతంటాడు...ఇది చెయ్యలేడా?: దేవినేని నెహ్రూ


పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ చేయలేడా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత ప్రతి కులం దగ్గరకు వెళ్లి రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తానని హామీ ఇవ్వలేదా? అని నిలదీశారు. రుణమాఫీపై బాబు తన విధానం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని నెహ్రూ డిమాండ్ చేశారు. అంత చేశాం, ఇంత చేశాం అని చెప్పుకునే బాబు రుణమాఫీ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News