: సమ్మె విరమించిన జీహెచ్ఎంసీ కార్మికులు


జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె విరమించారు. అధికారులతో ఈరోజు జరిపిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యధావిధిగా విధులకు హాజరవుతున్నట్లు కార్మిక సంఘం నేతలు వెల్లడించారు. ఆగస్టు 15లోగా కార్మికులకు హెల్త్ కార్డుల జారీకి జీహెచ్ఎంసీ అధికారులు హామీ ఇచ్చారు. ఈనెల జీతంతో పాటు 27 శాతం ఐఆర్, కొత్త వాహనాల కొనుగోలు, కార్మికులకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు చర్చల సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News