: అమెరికాలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయ్
అమెరికాలోని ఫ్రీమాంట్ నగరంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీసాయి ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయి మూల మంత్ర హోమం, దక్షిణామూర్తి, దత్తాత్రేయ హోమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ యాజమాన్యం తీసుకువచ్చిన ముత్యాలను బాబా విగ్రహానికి అలంకరించారు. ఆలయ అర్చకులు విశ్వప్రసాద్ మాట్లాడుతూ... ధర్మాన్ని ఆచరిస్తే కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడని తెలిపారు. ధర్మాన్ని చాటి చెప్పటమే గురుపౌర్ణమి ముఖ్యోద్దేశమని భక్తులకు ఉద్బోధించారు.