: ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు : మెస్సీ


ఫిఫా ప్రపంచకప్ ను తమ దేశానికి అందించడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని, ఈ అవకాశం వదులుకోరాదని అర్టెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లయొనెల్ మెస్సీ సహచరుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు. మెస్సీ ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టాడు. సెమీస్ లో డచ్ జట్టుపై గెలుపును రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టు జార్టి టోపో లోపెజ్ కు అంకితమిస్తున్నామని అన్నాడు. అర్జెంటీనా జట్టులో సభ్యుడినైనందుకు గర్విస్తున్నానని మెస్సీ పేర్కొన్నాడు. "ఎలాగైతేనేం ఫైనల్లో ప్రవేశించాం. ఇక అలసత్వానికి తావులేదు, బలమైన ప్రత్యర్ధితో పోరాటానికి దిగుతున్నాం, ఆటను ఇంతవరకు ఎంజాయ్ చేస్తూ ఆడాం, ఈ ఒక్క మ్యాచ్ లో పూర్తిగా లీనమై ఎంజాయ్ చేద్దాం" అని సహచరులకు పిలుపునిచ్చాడు. కాగా, అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాలర్ డీగో మారడోనా కూడా జట్టుతో పాటే ఉంటానని, ఫైనల్ వ్యూహరచనలో, ప్రణాళికల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చాడు. మెస్సీ ఆటపై నమ్మకముంచిన బ్రెజిల్ స్టార్ నెయ్ మార్ కూడా, తమ కలలను బూడిద చేసిన జర్మనీని ఓడించాలని కోరాడు. బ్రెజిల్ ఫుట్ బాల్ అభిమానుల స్టార్ మెస్సీ ఫైనల్ లో ఏం చేయనున్నాడో చూడాల్సిందే.

  • Loading...

More Telugu News