: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్
ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజు ఆటలో డ్రింక్స్ అనంతరం వికెట్ నష్టానికి 88 పరుగుల స్కోరు నమోదు చేసింది. కొత్త ముఖం శామ్ రాబ్సన్ 43 పరుగులతో, బల్లాన్స్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 457 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా, కెప్టెన్ కుక్ బ్యాటింగ్ కష్టాలు ఈ మ్యాచ్ లోనూ కొనసాగాయి. కుక్ 5 పరుగులు చేసి షమి బౌలింగ్ లో వెనుదిరిగాడు.