: జమ్మూకాశ్మీర్ లోని ఆర్టికల్ 370ను రద్దు చేయాలన్న పిల్ కొట్టివేత
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కట్టబెట్టే ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 370కి ఉన్న ప్రయోజనాలను దీర్ఘకాలికంగా రాజ్యాంగం అనుమతించదని, కానీ, సదరు రాష్ట్రంలో ఈ ఆర్టికల్ ను చాలా ఏళ్ల కిందటే తీసుకొచ్చారని పిల్ లో పేర్కొన్నారు. ఇదిలావుంటే, నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన కొన్ని రోజులకే ఈ ఆర్టికల్ పై తీవ్ర చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ కు ఉన్న ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు మధ్యవర్తులతో మాట్లాడతామని, ఇప్పటికే ప్రక్రియ మొదలైందని వివాదానికి తెరతీశారు.