: ఈ 'టీవీ'ని పేపర్లా చుట్టేయచ్చు!
మీరు చదివినది సరిగ్గానే ఉంది... శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించిన శాస్త్రవేత్తలు తాజాగా పేపర్ లా చుట్టేసే టీవీని రూపొందించారు. 18 అంగుళాల టీవీని ఎల్ జీ సంస్థ తయారు చేసింది. దీంతో, టీవీల తయారీ విభాగంలో సరికొత్త విధానాన్ని రూపొందించిన సంస్థగా ఎల్ జీ వినుతికెక్కింది. ఈ 'టీవీ' తయారీ మరిన్ని ఉత్పత్తుల రూపకల్పనకు ఉత్సాహమందించిందని ఎల్ జీ డిస్ ప్లే విభాగ తయారీ నిపుణులు పేర్కొన్నారు. పేపర్ లా చుట్టేసే ఈ అధునాతన టీవీలో 1200 x 800 పిక్సెల్ నాణ్యతతో చిత్రాలు కనిపిస్తాయని తయారీ నిపుణులు తెలిపారు. దీనికోసం ఓఎల్ఈడీ టెక్నాలజీ వాడినట్టు నిపుణులు స్పష్టం చేశారు.