: తెలంగాణలోనే హీరో మోటో కార్ప్ యూనిట్!


ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ భారీ యూనిట్ ను తెలంగాణలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లోని రావిరాలలో తమ ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని హీరో సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సదరు యూనిట్ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే మంచి రాయితీలు ఇస్తామని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నుంచి కూడా హీరోకు ప్రతిపాదనలు అందాయట. అయితే తాము మాత్రం తెలంగాణలోనే యూనిట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో సంస్థ తేల్చి చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News