: ఒబామా ఆహ్వానానికి మోడీ ఓకే


అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పంపిన ఆహ్వానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు. శుక్రవారం తనను కలిసిన అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి విలియమ్ బర్న్స్ తో కొద్దిసేపు మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో మోడీ అమెరికా పర్యటన దాదాపుగా ఖరారైంది. ఆ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య మరింత దృఢమైన సంబంధాలు సాధ్యపడతాయని భావిస్తున్నామని ఈ సందర్బంగా మోడీ అమెరికా ప్రతినిధితో అన్నారు. భారత్ పర్యటనలో భాగంగా విలియమ్స్ గురువారం విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కూడా భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News