: ఆ ఆరుగురు గవర్నర్లు ‘ఇంటిదారి’ పట్టారు
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... యూపీఏ నియమిత గవర్నర్లు ఒక్కొక్కరూ ‘ఇంటిదారి' పడుతున్నారు. శేఖర్ దత్, బీఎల్ జోషి, అశ్వినీ కుమార్ లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం విదితమే. ఇక అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న బీవీ వాంఛూ, ఎం.కె.నారాయణన్ తమ పదవులను వీడారు. తాజాగా మిజోరం గవర్నర్ బి.పురుషోత్తమన్ ఇవాళ రాజీనామా చేశారు. తనను సంప్రదించకుండా నాగాలాండ్ కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరింది.