: నా లైఫ్ లో అనుకోని ఘటనలు జరిగాయి: అంజలి


గత కొద్దిరోజులుగా మీడియాను హోరెత్తించిన హీరోయిన్ అంజలి మిస్సింగ్ కేసు, ఆమె రాకతో సుఖాంతమైన సంగతి తెలిసిందే. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ పోలీసుల ముందు హాజరైన అంజలి నేటి సాయంత్రం మీడియాతో మాట్లాడింది. గత ఐదారురోజులుగా తన జీవితంలో అనూహ్య సంఘటనలు సంభవించాయని చెప్పింది. తాను అదృశ్యం కావడంతో కొందరు దర్శకులు, నిర్మాతలు, నటులు ఇబ్బందులకు గురయ్యారని వారందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. తన లైఫ్ తన చేతుల్లోనే ఉందన్న అంజలి, ఇకపై తన దృష్టంతా సినిమాలపైనే అని పేర్కొంది. ఈ వ్యవహారంలో మొదటినుంచి సహకరించిన మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

  • Loading...

More Telugu News